కైలాస నిలయా…
శర్వాణి హృదయా…
ఏదయ్య నీ దయా…
తగదయ్య నిర్దయ…
పాపాత్ములము మాపైన కృప చూపుమా…
మేము ధన్యులం కావంగ దయ చూపుమా….!!కైలాస!!
చేయకుంటిమి భక్తితో నీ పాద సేవలు…
పెట్టకుంటిమి నీపైన దృష్టి మేమస్సలు…
మొక్కుబడి కొలుపులే మా పూజలు…
శివా…చెప్పతగినవి కావు మా సేవలు….
తృష్ణ పెరగనీ నీపైన శివశంకరా…
నీకది కష్ట సాధ్యము కాదు పరమేశ్వరా…!!కైలాస!!
మనసుతో నిను మేము చూసేట్టులా…
ఆత్మతో అనుసంధాన మయ్యేట్టులా…
ధ్యానముతో నిను మేము చేరేట్టులా…
పరధ్యానమున కూడా నీ స్మరణ చేసేట్టులా….
వరమిస్తే చాలయ్య విశ్వనాథా…
వేరేమి కోరమిక పార్వతీ ప్రాణనాథా…!!కైలాస!!
పాహిమాం…పాహిమాం…పార్వతీశా పాహిమాం…రక్షమాం..రక్షమాం.. పాహి పరమేశా రక్షమాం..