ఓం నమశ్శివాయ 

.ఓం నమశ్శివాయ 

అరమోడ్పు కనులతో ధ్యానించు చున్నావా శివా….
ఆర్తుల నాదుకొనుటెట్లని యోచించు చున్నావా శివా…
ఆహా…శివా..ధ్యానములో కూడా మా పైనే ధ్యాస కదా శివా నీకు…
పరధ్యానమునైన మేమంటే మరపురాదు కదా శివా నీకు…
ఏమవుతమయా శివా నీకు…
ఏమవుతమో చెప్పనని మాత్రమనకు…
బంధమేదో తెలియని బంధువయ్యావు శివా…
అడగకనే రక్షించు ఆత్మబంధువయ్యావయా శివా…
విస్తరించావు సువిశాల విశ్వమంతా నువ్వై…
కాపాడగ కోటానుకోట్ల జీవరాసుల వరమై…
దేదీప్యమానాల దీపాలతో అర్థించమా శివా ఆర్ధ్రత నిండిన నయనాలతో నీ ముందు నిలుచుని…
మకరంద మధురిమల పుష్పాలతో ప్రార్ధించమా శివా నీ పాద కమలాలనొకసారి తలచుకొని…
పాహిమాం…పాహిమాం…అన్నపదం..శివా…
ఆపన్నులకది దివ్య వేదం..శివా..

Leave a Comment

Scroll to Top