కరుణించు ప్రభువు శివుడొక్కడే…

కరుణించు ప్రభువు శివుడొక్కడే…
మనని మన్నించు తండ్రి హరుడొక్కడే….
లింగమే శంకరుని ప్రతిరూపము…
పూజించరా లింగమును ప్రతి ఉదయము…
ఏ ఉత్పాతములు నీకు ఎదురవవ్వవు ..
ఆ తండ్రి కరుణ జలపాతములు నీకు కరువవ్వవు….!! క!!

భక్తులయెడ సమదృష్టిని సారించి సోమశేఖరుడు…
మనపై అమిత ప్రేమను కురిపించు ఆది శంకరుడు…
సరి సమాన భాగములవాడు అర్ధనారీశ్వరుడు….
అసమాన కీర్తి ప్రతిష్టలనందించు  చంద్రశేఖరుడు….
అద్భుతం…శంకరుని లీలామృతం…
పరమాద్భుతం… ఈశ్వరుని నామామృతం…!! క!!

భక్తజన ఘోషలను ఆశించువాడై సాంబశివుడు…
దీన జన బంధువుగా పేరొంది నాడు సదాశివుడు….
సృష్టి స్థితి లయ కారకుడు మహాశివుడు…
చిత్తశుద్ధితో పూజిస్తే దగ్గరవుతాడు పరమశివుడు…
అహోరాత్రులూ  చేసినా జపతపములు….
శివుని కరుణ లేకున్న తొలగునా మన కర్మలు…!! క!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top