శంభో హర హర జంగమ…

శంభో హర హర జంగమ…
నా మనసున నిలిచిన లింగమా…
గంగానది శివలింగమా…
మా గౌరీ ప్రియ సౌభాగ్యమా…
వినరా..నా ప్రతి గాథను…
విని తుడవర శోకపు గంగను…!!శంభో!!

కష్టాలన్నీ ఒక వైపు…
బాధ్యతలన్నీ ఒకవైపు…
చుట్టేస్తుంటే ఒక వైపు…
ఇక చూసేదెట్లు నీ వైపు…
శివ శివ శివ శివ శంకరా…
ఈ దీనుని మొర విని కావరా…!!శంభో!!

తొలిచెను మదిలో ప్రశ్నొకటి…
నీవే దారిని చూపుము ముక్కంటి…
పెగలిన వేదన వినమంటి…
ప్రత్యేకముగా నను కనమంటి…
శివ శివ శివ శివ శంకరా…
నా మొర విని నను కరుణించరా…..!!శంభో!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా…రక్షమాం…

Leave a Comment

Scroll to Top