పార్వతీ పరమేశ్వరా…

పార్వతీ పరమేశ్వరా…
జగములేలే దేవరా…
గంగ గౌరీ శంకరా…
మా హృదయ సీమను ఏలరా…
అర్పణం నా మానసం అందుకో శివశంకరా…
సమర్పణం నా జీవితం నన్నాదుకో గంగాధరా…!!పార్వతీ!!

పూల మాలలు వేసి నీకు సంతసించగ నుంటిని….
కర్పూర హారతులనిచ్చి నీకు వేడుకొన నిలుచుంటిని…
క్షణము నీవు ఆలకిస్తే పలికెద నీ స్తోత్రము…
ఒక క్షణము నీవు అనుమతిస్తే తాకెదను నీ పాదము…
జంగమయ్యా చూపరా…ఒక చూపు  నాపై జాలిగా…..
శివ శంకరయ్యా చేతురా…నీ పాద పూజను భక్తిగా…!!పా!!

తొంగి చూడు మనసులో నువ్వుందువయ్యా ఎప్పుడూ…
భక్త భృంగి లాగా నన్నునూ భావించవయ్యా ఎప్పుడూ…
ప్రమద గణముల మాదిరి పంచేద్రియములను చేతురా…
నటరాజువై నా హృదయమందు నాట్యమాడుము శంకరా…
నృత్య భంగిమ చూసి నేను ధన్యుడవతును శంకరా…
ఇది సత్యమయ్యా జంగమా…నీ పాద దాసుడనేనౌతురా…!!పా!!

పాహిమాం…పాహిమాం…పార్వతీశాపాహిమాం….రక్ష మాం…రక్ష మాం..గౌరీ మహేశా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top