ఓంనమఃశ్శివాయనమః
భీకరం..శివశంకరం..
రత్నాకరం..ప్రళయంకరం..
భయానకం శివా…నీ వీక్షణం..
సహేతుకమా శివా..ఈ తీక్షణం..
భరింప సాధ్యమా శివా తేరి పార నిన్నుచూడ భూతనాధ..
కరుణించుమా శివా…రక్తవర్ణ రుధిర నేత్ర మంజునాధ…
భూత ప్రేత పిశాచాల ఖర్మలను మా మనసునుండి తరమరా…
అగ్నిహోత్ర పునీతమైన గుణ గణాలనొసగి మమ్ము శివా కావరా…
జగము దద్దరిల్లునట్లు పాహి…పాహి అందుమయా….
కలియుగము ప్రజ్వర్లిల్లునట్లు కోట్ల సార్లు కొలుతుమయా..
ఉప్పొంగి పొంగి పారాలి గంగ వరద ప్రవాహాలై…
పోటెత్తిముంచి పోవాలి శివా శాంతింప నిన్ను శాంతి సముద్రాలై…
శాంతి…శాంతి…శంకరా…
శాంతించు భీమశంకరా….
రక్ష…రక్ష…శంకరా…
రక్షించురా..దయాకరా…