వ్రాయనా శివా…నాల్గు భక్తి పదములు నీకు నాగేశ్వరా….

వ్రాయనా శివా…నాల్గు భక్తి పదములు నీకు నాగేశ్వరా….
అచ్చ తెనుగులో వ్రాసి అర్పించనా నీకు అమరలింగేశ్వరా…
ఆదిశంకరుడెపుడూ ఆదుకుంటాడని…
సోమేశ్వరుడు మము నిత్యము చల్లంగ చూస్తాడని…
భీమశంకరుండంగ భయమేల మాకని..
కాళేశ్వరుడే అండగా వుండగా ఆపదలన్నవే రావని…
నడచుచున్నామయా శివా…కాలచక్రముతో కలిసి కదులుతూ ముందుకి…
అడుగులేచుచున్నామయా శివా…కాత్యాయనీ పతి కలడు మనకు తోడన్న ధైర్యము తో మునుముందుకి..
వమ్ము కానీయకయా శివా… నీ పైన   మా నమ్మకం…
ఏ కలి మయాలైన పారిపోవాలి శివా..చూసి మా నుదుటి పైనున్న నీ విభూతి సంతకం…

పాహిమాం…పాహిమాం..శివశంకరా…
ఎన్ని  పదములు వ్రాసినా తనివి తీరునా శివ శంకరా…

Leave a Comment

Scroll to Top