అడిగాను శంకరా…నా మనసుని..

ఓం నమః శివాయ నమః

అడిగాను శంకరా…నా మనసుని..
కొలవవే ఒకసారి పరమ శివునని…
చెప్పింది నాతోటి..నిత్యమూ కొలిచేది నిన్నేనని…
అనునిత్యము తనతోటి మమేకమై వుండేది నువ్వేనని…!!అడిగాను!!

తాను చెప్పింది విన్నాక మూగ బోయాను….
తనలోన నిను చూపాక నిర్ఘాంత పోయాను….
ఎంత దయరా శంకరా…ఈ జన్మపై…
కొలువుండి పోయావు అలా నా మనోఫలకముపై…
చాలయ్య చాలు ఈ జన్మకి…
ఇక విడనయ్య నీ పాదాలు ఏ జన్మకి…!!అడిగాను!!

సదా నీ ధ్యానమే లోకమై…
శివా..నీ తలపులే ప్రాణమై…
గడచి పోతుంటే రోజులన్నీ బిరబిరా….
మనసు నిర్మలముగ వుంటుంటే నీ దయ వలన  హర హరా…
ఎంత ధన్యుడననిపించు ఈ ధరణి మీద ..
నీ కరుణ ఋజువనిపించు నేను ఈ నేలమీద …!!అడిగాను!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా ..పాహిమాం..
రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top