ఈశ్వరీ…పరమేశ్వరీ….

ఓం నమః శివాయ నమః 

ఈశ్వరీ…పరమేశ్వరీ….
శాంకరీ…ప్రియ శంకరీ…
నవరాత్రి శోభలను కాన రావమ్మ..
నవదుర్గవై అలరార తరలి రావమ్మ…!!ఈశ్వరీ!!

వేల కొలదీ జనము వేచి వున్నారమ్మ….
వేడుకొన నిను గని నిలిచి వున్నారమ్మా….
ఒకసారి కానవే కాత్యాయనీ…
బారులై తీరున్న భక్త జన సమూ ముని…
ఏ నోట వున్నా ఒక్కటే మాట…
కరుణ తల్లిని చూచుటే లక్ష్యమని చెప్పుకొను మాట…!!ఈశ్వరీ!!

ఆచరించీ స్నానములు ..పెట్టుకొని పసుపు కుంకుమలు….
పూల ఫలముల నడుమ  పట్టుచీరలు పెట్టి….
అగరువత్తులతో బాటు ఎర్ర గాజులను పెట్టి…
తరలి వస్తుంటే నీకివ్వ సుహాసినిలు వేలలై లక్షలై….
కదలి వస్తుంటే సుధామణులు వానలై..వరదలై..
జాగేల జననీ కదలి రావంగ…
సింహ వాహనమెక్కి రావమ్మా వాయనములను అందుకొనగ…!!ఈశ్వరీ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ.…
రక్ష మాం…రక్షమాం..లోకేశ్వరీ..

Leave a Comment

Scroll to Top