శంభో హరా శంకరా…

ఓం నమః శివాయ నమః
 

శంభో హరా శంకరా…
గంగానదీ తీర హరహర…
ఎన్నడని అడగము…
ఎప్పుడని కోరము…
కరుణిస్తె చాలయా శంకరా…ఒకసారి ఈ జన్మకి…
మా పైన దయచూపితే చాలయా శంకరా…ఏదో ఒకనాటికి…
పార్వతీ మదినిలయ శంకరా….
మా మనవి వినిపించుకొనుమయ్య గంగాధర…!!శంభో!!!

అనుదినము నిను మేము
కొలుచుకుంటున్నాము..
ప్రతి క్షణము నిను మేము తలచుకుంటున్నాము..
మా  హృదయాన నీ రూపమే… నిలుపుకొని ఉన్నాము…
దిక్కు నీవని నమ్మి
వేడుకొనుచున్నాము…
కరుణిస్తె చాలయా శంకరా…ఒకసారి ఈ జన్మకి…
మా పైన దయచూపితే చాలయా శంకరా…ఏదో ఒకనాటికి…
పార్వతీ మది నిలయ శంకరా…
మా మనవి వినిపించుకొనుమయ్య గంగాధర…!!శంభో!!

ఏ పాటి పూజలని మావి.. .
ఎంతోటి సేవలని మావి…
చినబుచ్చుకోకయ్య
చిత్కళావల్లభా….
సుమనసుతో గైకొనుము గౌరీ మదిసౌరభా..
మదనాంతకా…నీకు మారేడు దండలు…..
ప్రియపాలకా..నీకు శతకోటి దండాలు…
కరుణిస్తె చాలయా శంకరా… ఒకసారి ఈ జన్మకి…
మా పైన దయచూపితే చాలయా శంకరా…ఏదో ఒకనాటికి…
పార్వతీ మది నిలయ శంకర..
మా మనవి వినిపించుకొనుమయ్య గంగాధర…!!శంభో!!

పాహిమాం… పాహిమాం…శంకరా…
రక్షమాం…రక్షమాం..భవహారా…

Leave a Comment

Scroll to Top