అర్థించ నన్నవి శంకరా…ఏ వరములు….

ఓం నమః శివాయ నమః 

అర్థించ నన్నవి శంకరా…ఏ వరములు….
నీ పాదములను కడగాలనుకున్న ఈ కరములు…
కోరనే కోరనన్నవి శంకరా…ఏ కోర్కెలు….
నీ చరణాల పూరెక్క తాకలనుకున్న ఈ తనువులు….
సుందరాకారాన శివశంకర…
నిను దర్శించుకొనుచుంటే
గంగాధర…!! ఆర్థించ!!

దర్శనంబిచ్చావు అది చాలు…మా జన్మ ధన్యము….
తరియింపజేశావు… ఇంకేందుకేదేని వరము..
కొనసాగనీ శంకరా…నీ దయను ఇట్లాగనే…
మా మనసు స్మరియించనీ శంకరా…మునుపటట్లాగనే…!! అర్థించ!!

మునులెల్ల, జనులెల్ల స్తుతియించులాగున….
సురులెల్ల…ఎలుగెత్తి శ్లాఘించు లాగున..  
దివ్య మంగళ రూపాన
దేదీప్యమానమై….
సర్వ శుభములనిచ్చు మా పాలి దైవమై…
వెలుగొందు చున్నావు…విశ్వేశ్వర…
మా కనులందు నిలిచి మము కరుణించు చున్నావు పరమేశ్వరా…

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా..
రక్షమాం… రక్షమాం…సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top