వైష్ణవాలయమాయే నేడు శివుని మందిరము….

ఓమ్ నమ: శ్శివాయ నమ:🙏🏼🙏🏼🙏🏼

వైష్ణవాలయమాయే నేడు శివుని మందిరము….
శివకేశవ నిలయమాయే ఉజ్జయిని పురము…
వేడుకొన రారండి కలసి అందరము…
హరిహరుల దర్శించి చేసుకొన సంబరము…!!వైష్ణవ!!

 నీలమేఘఛ్ఛాయ నీలకంఠేశ్వరుడు
కాళలింగమున నేడు కాంతులను చిందే…
నిలువు నామాలెట్టి ఆదిశంకరుడు..
ఆదివిష్ణువు మల్లే  రూపమును పొందే..
ఏక దర్శన భాగ్యాన లోకాధిపతుల కనగ ఎవరికైనా ఇది అబ్బునా అండి?
అడగకనే అరచేతిలోకి వచ్చి దర్శనంబిచ్చిన దివ్య మూర్తుల వరమెంత అబ్బురమండి….
మనసార తెలిపెదము నమస్కృతులు….
భక్తి తో పాడేదము వే వేల కృతులు…

పాహిమామ్…పాహిమామ్..శివ విష్ణు రూపాయా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..కైలాస (శ్రీ)నివాసాయా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top