ఓమ్ నమ: శ్శివాయనమ:


అందించినామయ్య అమరేశ్వరా…
మధుర ఫలములు నీకు మల్లేశ్వరా..
ఏరి కోరి తెచ్చాము వేడుకొనగ నీకు ఎన్నెన్నో ఫలములు…
కోరి నీ దరికి వచ్చాము ఇవ్వరా మాకు పుణ్యఫలములు…
సృష్టించినావు ఈ ప్రకృతి లో ఋతువుల వారిగా పళ్ళనీ, కాయలనీ…
దీవించినావు ఏ ౠతువులోనైన తీర్చుకొనగ ఏ ప్రాణినైన ఆకలిని…
నారు పోసిన వాడివి నువ్వేనయా శివా…
నీరుపోసెడివాడివి నువ్వేనయా శివా…
ఎంత ఎండ పడినా తడి ఆరని మడిలా చల్లంగ చూడరా శంకరా…
ఎన్ని బాధలున్నా ఏ కంటా తడి కారకుండ చూడరా హర హరా…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరాయ పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సరేశ్వరాయ రక్షమామ్