ఈశ్వరా…పరమేశ్వరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఈశ్వరా…పరమేశ్వరా…
నీ పాదములిడబోమురా…
పార్వతీ హృదయేశ్వరా…
నీవే మా జీవన సర్వస్వమ్ము రా…
నమ్మరా..శంకరా ఇది మా నివేదనము…
వరమిమ్మురా..ముదమవును మా మానసము..!!ఈశ్వరా!!

నిమగ్నమవాలని వుంటుంది నిత్యమూ నీ పూజలో…
నిర్విఘ్నముగ లీనమవాలనిపిస్తుంది నీ సేవలో…
అడ్డొస్తున్నాయి శంకరా..భవబంధభారాలు…
గడ్డుసమస్యలైనాయి..తీర్చుకొనంగ మా కోర్కెలు…!!ఈశ్వరా!!

యోగినైతే బాగుండుననిపిస్తుంది ఒక్కొక్కసారి…
నీ నామస్మరణము చేయాలనిపిస్తుంది ఘడియకొక్కసారి..
కుదరదయా శంకరా…నేనొక బ్రతుకు బాటసారి…
వరమిస్తే పుడతాను మళ్ళీ యోగినై నిను స్మరియించ క్షణముకొకసారి..!!ఈశ్వరా!!

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా.. రక్షమాం…

Leave a Comment

Scroll to Top