ఉగ్రరూపాయా..ఉమామహేశ్వరాయా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఉగ్రరూపాయా..ఉమామహేశ్వరాయా..
క్రోధవదనాయా…కాళేశ్వరాయా..
కళ్ళెర్ర జేస్తే కాపాడువారెవరురా కాశీపతీ…
ఆదుకొనువాడు ఆగ్రహిస్తే మాకెవరురా శంకరా గతి..!!ఉగ్ర!!

ఇంద్రియనిగ్రహములేని శక్తి హీనులము…
జ్నానేంద్రియముల విలువ తెలియకున్నాము…
తెలిసీ తెలియక చేసిన తప్పులను మన్నించవయ్యా…
మొదటితప్పుగా భావించి తండ్రిలా ప్రేమతో దండించవయ్య..!!ఉగ్ర!!

క్షణమైన మనగలద శంకరా..ఈ విశ్వము…..
క్షణికావేశములో చూపిస్తే నీ ప్రతాపము…
యోచించరా యోగముద్రాయ..
ఉపసంహరించరా ఆగ్రహావేశమును వీర భద్రాయ…
శాంతింపజేయ పరమేశ్వరుని, రమ్మంటూ ప్రార్ధించేము బ్రహ్మ,విష్ణాది దేవతలను….
గరళకంఠుని
ప్రసన్నము చేయమనికోరేము గంటా నాదములతో ప్రమదగణములను….!!ఉగ్ర!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరాయ పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..రౌద్రరూపాయా సర్వేశ్వరాయ రక్షమాం..

Leave a Comment

Scroll to Top