ఓమ్ నమ:శ్శివాయ నమ:


నెరవేరునయ్యా…శంకరా ఏ కోర్కెలయినా…
అడిగితే ఇచ్చేవు..మాకు ఎన్ని వరములైనా…
వలదందువు సంశయము ఎవరికైనా…
ప్రేమ మీరా…పిలిచేవు నీ మధుర ధరహాసాలతో కమలనయనా..!!నెర!!
మీ కలలు నిజమవ్వు క్షణము వచ్చిందనీ…
రారండంటూ పిలిచేవు దర్శించుకొనమని…
సిద్ధంగ ఉన్నాను కరుణించ మిమ్మనీ..
గంగ స్నానాలు చేయిస్తే చాలు ఇస్తాను పుణ్యాలు మీకని..!!నెర!!
భక్తుల యెడ నీ ప్రేమ రాగ బంధాలు..
అశక్తులయెడ కురిపించే నీ కరుణ కుసుమాలు..
చెప్పలేనన్ని ఆ దివ్య భావాలు..
ఏ జన్మలోనూ పొందనట్టి నీ దీవెనల మణుల మాణిక్యాలు…
ఆస్వాదించే కొలదీ ఆశ పెరిగేను మాలో…
ప్రసాదించే కొలదీ భక్తి పరిపక్వత చెందేను మాలో…!!నెర!!
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..