ఓం నమో నమో,  నమో నమో, నమో వీర శంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఓం నమో నమో,  నమో నమో, నమో వీర శంకరా…
హే హారోం హరా శుభంకరా ప్రళయ కాల భీకరా…
అపన్నహస్త భూషణా ఆది మూల పురుషుడా…
ప్రసన్న రూప ధారుడా మమ్ముకావ దేవుడా..
సదా శివా..ప్రభోదేవ..నమో శివం శంకరం. .
ప్రణవనాద, ప్రియానంద నమో శ్రీ మహేశ్వరం..!!ఓం!!

ఉగ్రరూప  ఉమాపతీం..
దర్శనం…భయానకం..
మా సమగ్ర చరిత తెలిసినట్టి తండ్రివయా కాదిది సహేతుకం..
ఇలా శిలై నిలిచిపోమా నిన్నే వేడుకొనగా…
కలే సత్యమవదా కోరి నిన్నే సదా కొలవగా…
సదా శివా.. ప్రభోదేవ..నమో శివం..శంకరం..
ప్రణవనాద, ప్రియానంద, నమో శ్రీ మహేశ్వరం…!!ఓం!!

ముదావహం..ముదావహం..నీ మధుర నామ స్మరణం…
అదే మాకు ఆయుధం..త్రిజన్మ పాప హరణం…
మనోభీష్ట ఫల సిద్ధిరస్తు వరమునివ్వు శంకరా…
సర్వకాల సర్వవ్యవస్థల యందు నిన్ను కొలువు అభీష్టమును నిజము చేయి హర హరా!!ఓం!!

పాహిమాం…పాహిమామ్..పార్వతీశ..పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..జగదీశా రక్షమాం..

Leave a Comment

Scroll to Top