ఓంనమఃశ్సివాయనమః


గతి తప్పిన కాలమును గర్జించుచున్నట్లు…
మతి తప్పి నడచుచున్నందుకు మందలించుచున్నట్లు…
సింగమై సాక్షాత్కరించినావా శివా…
నరసింహమై శిక్షించ వచ్చినావా శివా…
శాసించు వాడవునువ్వేరా శివా కాలమును….
అభిశంసించువాడవు నువ్వేర శివా తన గమనమును….
కలగన్న కాలము కనిపించదాయే…
నెరవేరక కలలు మిగిలి పోయే…
ఆశలన్నీ నేడు అడియాసలాయే..
జీవించుటన్నది నిత్య రణమాయే…
గెలిపించరా శివా ఈ ఆటలో…
విధి ఆడుతున్న వింత సయ్యాటలో…
ఏ దైవమూ శిక్షించదు భక్తులనని…
అను నిత్యమూ రక్షించును అశక్తులనని….
నమ్మి కొలిచే లోకమురా శివా ఇది…
ఆర్ధ్రత నిండిన కనులు పలికే శ్లోకము రా శివా ఇది…
పాహిమాం…పాహిమాం..శంకరా….
మాం…పాహి…మాం..పాహి శివశంకరా…