ఒకే ఒక్క వరం..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఒకే ఒక్క వరం..
అడగమింకేమీ మేమెవ్వరం..
ఇస్తేనే చాలయ్య నీ దర్శనం.
కనికరిస్తేనే చాలయ్య ప్రతి దినం.!!ఒకే!!

వజ్ర వైడుర్యాలు వలదయ్యమాకు…
వెండి, బంగారు లోహాలపై ఆశ కలగ నీకు…
ఆధ్యాత్మిక సిరి సంపదలు మాకియ్యవయ్య.
పంచాక్షరీ మంత్రాల పద నిధులు మా కొసగవయ్య…!!ఒకే!!

కనక వర్షముగా కానుకలు మా పైన కురిపించినా…
ఏక చత్రాధిపత్యముగా జగమేలు నీ కాలి కొనగోటికి అవి సరితూగునా…
ఎందుకయా శంకరా…మాకు భోగ భాగ్యాలు..
సుమనసు తో నువ్విస్తే చాలయా…ఆయురారోగ్యాలు…

పాహిమాం…పాహిమాం..శివశంకరా
రక్షమాం..రక్షమాం..అభయంకరా…

Leave a Comment

Scroll to Top