ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఎదురుచూస్తున్నాయి మా కనులు శంకరా..
ఎంతకూ రావేమి శివశంకరా…
పొద్దుపొడిచేలోగ ఒక్కసారైనా నిన్ను చూడాలని…
నిద్దురోయేవరకు మనసారా నిను నేను కొలవాలని..
వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి…
ఎంతకూ రాడేమని ప్రశ్న వేస్తున్నాయి…!!ఎదురు!!
సాక్షాత్కరించవుగా సాయంత్రము..
సంధ్యదీపాలవెలుగులో పఠించగా నీ మంత్రము…
చదువుతుంటే భక్తితో నీ మంత్రపుష్పాలు…
జల జలా రాలేను మా కంట ఆనంద భాష్పాలు…
పులకించి పోయింది పరమేశ్వరా ఈ తనువు…
తీరింది నేడు, చాన్నాళ్ళనుండి ఈ అనుభూతికోసం పరితపించిన నా మనసు కరవు…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమాం…రక్షమామ్..సర్వేశ్వరా రక్షమాం..