ఓం నమః శివాయ నమః
హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము…
మేము కననీ నీలో ఆ రాములోరి మీద గల నీ భక్తి భావము…
తెలుసుకొనగ ఎటుల చేయ సేవ స్వామికి…
నీ దరికి వచ్చినాము తెలుసుకొని మేము కూడా చేయ మా సాంబశివునికి…!!హనుమా!!
ఘనత కెక్కినావయ్య అంజనీ సుతా సీతమ్మ జాడ తెలిపి…
తల్లి సీతమ్మ క్షేమమని రామయ్య కంట తడిని తుడిపి…
హత్తుకునే ఆ రాముడు ప్రేమ మీరగా…
మిత్రమా..నా ప్రాణమంటివాడవనే మనసు సాక్షిగా…!!హనుమా!!
అడ్డువేసి ప్రాణాలను ఆ లంక కెళ్ళి వచ్చావు…
ఏకంగా కొండనే తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలే నిలిపావు…
సాహసించి సేవ చేసి స్వామి పరాయణుడివి అయినావు..
అందుకే పరమేశ్వరునికీ… ప్రీతియై వెలుగు లీనుచున్నావు…!!హనుమా!!
పాహిమాం…పాహిమాం…శ్రీ ఆంజనేయ పాహిమాం…
రక్షమాం…రక్షమాం…భక్తాంజనేయ రక్షమాం….