ఓం నమః శివాయ నమః
పరీక్షించకయ్యా…పరమేశ్వరా..
నీ దయ లేకున్న వ్రాయగలనా నీ భక్తి గీతాలు నేను..
అనుభూతి చెందుచున్నాను ఈశ్వరా…ఆ గీతాలు వ్రాయు క్షణము పరమాద్భుతమని నేను..
స్పురణకు రానీయ్యవయ్య నీ భావనలు నాలో…
ప్రేరణను కలిగించనీవయ్య నీ చిత్రాలు లోలో…
శివ శంకరా…ప్రణవ గంగాధర…
అభయంకరా..నమో శంభో హరా…!! పరీ!!
నీ ఆరాధనల భావాలు నాల్గు వ్రాయాలని…
ఆ దివ్య భావనలు పదుగురితో పంచుకోవాలని….
కదిలింది నా కలము కానరా శంకరా…
వ్రాస్తోంది నీ చరణాలు చదవరా హార హరా….
తప్పులుంటే మన్నించు గంగాధర…
తప్పనిపిస్తే ప్రేమతో దండించు గౌరీవరా…!!పరీ!!
వేకువ జామునే లేచి కొలుచు భక్తులు కలరు ఇలలోన కోకొల్లలు…
మరునాటి ఉదయ సంధ్యలు చూచు భాగ్యమ్ము నిచ్చావని మొక్కేరూ వేల వేలు..
జీవమున్నంత వరకూ నీ సేవలో తరియించు వరమివ్వమంటూ…
ఈ జన్మ కడవరకు నీ పద కీర్తనలు పలుక కరుణించమంటూ..
ప్రార్థించు వారే ఎల్లరూ ఈ జగాన…
నిన్ను స్మరియించు వారే ప్రతి ఒక్కరూ దీన వదనానా…!!పరీ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..