ఓం నమః శివాయ నమః
ఎంత పుణ్యము చేసుకొనెనో శంకరా…మా రెండు కనులు…
నిను గాంచి ధన్యతను పొందాయి వేవేల జన్మలు…
ఇచ్చావు ఈ వరము ఈ జన్మకు…
మనసార నిను మేము కొలిచేందుకు…
కారుణ్య రూపమా…శ్రీ కాళ లింగమా…
మా పాలి దైవమా… జగమేలు జంగమ…!!ఎంత!!
ఏకాగ్రత లేనట్టివి మా పూజలు…
సహేతుకము కానట్టివి మా సేవలు…
లోపాల శిలలయ్య మా తనువులు..
ఏ శిల్పికీ కొరగాని రాళ్లయ్య మా జన్మలు…
ఏం చేస్తవో ఏమో శరణమంటిమి శంకరా…
ఏమిస్తవో ఇవ్వు నీ ఇష్టమంటిమి హర హరా…!!ఎంత!!
కార్తీక మాసాన కాత్యాయనీ పతి…
దీపాలు వెలిగించి ఇచ్చాము హారతి…
ద్వాదశ లింగాల రూప దాక్షాయణి పతి…
మోక్షాలు ఇవ్వరా మమలేశ్వర పశుపతి…!!ఎంత!!
పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..