ఓంనమఃశ్శివాయనమః


ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః..
ఓం నమో శ్రీ కాళేశ్వరాయ నమో నమః
నీ హృదయమెంతటి విశాలమో…
నీ కరుణ నిధులనిక్షేపముల విలాసమో..
తెలియదు కానీ తొలిచే కొలదీ తరగని గనిలా…
మది కొలిచే కొలదీ కురిసే వరముల ఝరిలా..
పరుగాపని ప్రవాహమై పరమేశ్వరా…
భువి జనుల దీవించు జగదీశ్వరా..!!ఓం!!
జగములనేలే జగపతివయ్యా…
జనహృదయములేలే గణపతివైనావయ్య…
అష్టదిక్కులకు అధిపతివయ్యా…
ఇష్టసుతుని ప్రియరూపమై అరుదెంచావయ్యా..!!ఓం!!
తండ్రీ తనయుల ప్రేమకు ప్రతిరూపం మీ అనుబంధము…
తరముల తరబడి తలచుకొనే మీ ఉమాపతీ సుతుల దివ్యానుబంధము…
చూసిన కనులకు కలుగును భాగ్యము…
నీ కరుణను పొందగ కలిగెను యోగ్యము…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్