ఏ రూపమని కొలుతురా శివ శివా..

ఏ రూపమని కొలుతురా శివ శివా..
ఏ భావమని పిలుతురా శివ శివా..
లింగాన అమ్మోరిలా ఈ భంగిమ…
ఎరుగంగ మా తరము కాదోయిరా జంగమా…

అరమోడ్పు కనులతో,ధ్యాన ముద్రలో
ఆరాధిస్తున్నట్లుంది నిన్ను తనలో…
పరమ పావనమైన మా జనని భక్తి భావములో
కొలుచుకుంటున్నట్లుంది నిన్ను మదిలో…
పరికించరా శివా…ఓ సారి మా తల్లి కైలాస గిరి పుత్రిని….
పదునారు భువనములలో కనరాని తన ప్రేమ త్యాగనిరతిని…
కాత్యాయినీ కలలు పండించరా శివా…
కరుణామయిని ఇక కటాక్షించరా శివా…

పాహిమాం..పాహిమాం..ఈశ్వరా…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా...

Leave a Comment

Scroll to Top