మూడు కన్నుల శివుడికి మారేడు దళముల పూజలు…

మూడు కన్నుల శివుడికి మారేడు దళముల పూజలు…
కాపాడు కరుణామూర్తికి ఏడేడు జన్మల సేవలు…
చేసుకొనమా శివా..దివిన కూడా నీకు జరగని రీతిలో…
స్థబ్దులవ్వాలి శివా..సురులు సైతం ఎన్నడూ నిను కనని అనుభూతిలో…
మా మాటలు మంత్రాలు కావాలి శివా…
మా మనసులు మంత్రపుష్పాలు కావాలి శివా…
భక్తితో అర్పిస్తాము నీకు భగవంతుడా..
దయాగుణ సంపన్న మాపాలి శ్రీమంతుడా…
నీ మదిని గెలవగ మునులమై చేయగలమా శివా మేము తపస్సులు..
మా మనసు తెలుసుకొని మమ్ము కావగ ఉదయించనీ శివా  మా లోన  నీ ఉషస్సులు….

పాహిమాం..పాహిమాం..శివశంకరా..పాహిమాం…
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top