ఓంనమఃశ్సివాయనమః


ఓంకారేశ్వరా…జ్యోతి స్వరూపా..
శ్రీ కాళేశ్వరా…శాంతి స్వరూపా..
కనిపించరా కాశీవిశ్వేశ్వరుడా…
కనిపించి కరుణించరా కరుణా సముద్రుడా…
అర్ధమంటూ లేక సాగే మా జీవితానికి
పరమార్ధమేమిటో తెలుపరా శంకరా..
స్వార్థమంటూ తెలియక మా బ్రతుకు నడిచే
మార్గమేమిటో చూపరా శంకరా…
అఙానము తో ఆశా మోహాల వలలోన పడి పొరలు కమ్మాయి రా శివా మా కళ్లు…
మా గమనాల రహదారులలో తుదకు మొలిచాయి రా శివా నిరాశ,నిస్పృహల తుమ్మముళ్ళు…
నీ పాదాలు మొక్కేము వెలిగించరా శివా…నీ ఙానజ్యోతి మాగుండెలో…
శ్లోకాలు పలికేము పూయించరా శివా..
BHAKTHI సుగుణాల పూపొదలు మా మనసులో…
ఎన్నడూ చవి చూడని నీ దివ్యానుభూతిని పొందనీ….
ముందెన్నడూ అందని పుణ్య పురుషార్ధముల ఫలములను పొందనీ…
పాహిమాం..పాహిమాం..శివశంకరా…
రక్షమాం..రక్షమాం..అభయంకరా…