ఓం నమః శివాయ నమః
ఉజ్జయినీ శ్రీ మహా కాళేశ్వరా…
భస్మాభిషేక ప్రియ పరమేశ్వరా…
నా రెండేళ్ల కోరికను మన్నించినావు…
నిను దర్శించుకొను వరమిచ్చి తరియింపజేశావు…
శంభో హరా…శంకరా హరహరా
గంగాధరా.. ఈశ్వరా…!!ఉజ్జ!!
అడుగిడగనే నీ ఆలయాన
తనువు నీ వశమాయే సూర్యచంద్ర నయనా…
హర హరా అని పలుకుతూ నా పెదవులు…
నినుకనగ బిరబిరా సాగాయి నా నడకలు…
వేల గొంతుకలు నీ నామ స్మరణ చేయుచుంటే….
కోట్ల ద్వనులై నీ ఆలయాన ప్రతిధ్వనించుతుంటే…
చూడ రెండు కళ్ళూ సరిపోక శివశంకరా…
నా మనో ఫలకముపై నిను ముద్రించు కున్నాను పరమేశ్వరా..!!ఉజ్జయిని!!
చెంబు గంగ నీళ్లను నా చేత శిరముపై పోయించుకుంటివి…
ఈ రెండు కరములకు వరమిచ్చి నిను తాకనిస్తివి…
గడిపింది కొన్ని క్షణములైనా నీ గర్భాలయాన…
మరచి పోలేని దివ్యస్మృతులు మిగిలాయి నా జీవితాన…
ఏమిచ్చి తీర్చగలవాడ శంకరా…నీ ఋణమును….
నీదైన నా హృదయమును తప్ప ఏమివ్వలేని నిరుపేదను…
ఈ జన్మ ఆసాంతమూ నీ సేవలో తరియించు వరమియ్యవయ్య…
పున:దర్శన భాగ్యమ్మునిచ్చి నను కరుణించవయ్య…!!ఉజ్జయినీ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా ..పాహిమాం…
రక్ష మాం…రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…