ఓం నమః శివాయ నమః
రుద్రాక్ష కిరీటి వరదాయకా…
హస్తి సుమ కోమల ముఖ నయన శుభదాయకా..
అలరారుచున్నావు అధినాయ కుని వై….
ప్రమాద గణముల నేలుచున్నావు గణ నాయకునివై…!!రుద్రాక్ష!!
ధారావాహికముగ వ్రాయ నీ సాటి ఎవరు లేరని….
ఎంచుకున్నాడు వ్యాస మహర్షి భారతమును వ్రాయించ నిన్ను మించిన వారు ఇక రారని…
దంతమును ఘంటముగ చేసి ఏకాధాటిగా రచియించినావు…
ఏకదంతునిగ కీర్తింపబడి లోకాల కొనియాడబడుతున్నావు…!!రుద్రా
చరిత పుటలలో నిలిచి ఉన్నావు అమవసిని ఎరుగని అపర చంద్రునిలా….
సంకల్ప సిద్ధివై వెలుగొందు చున్నావు ఎన్నటికి ఆరని సుజ్ఞాన జ్యోతిలా..
ఆది దంపతుల అనురాగ బంధమా ఆదుకోవయ్యా…
నవరాత్రి పూజల నీరాజనాలివి అందుకోవయ్య…!!రుద్రాక్ష!!
పాహిమాం…పాహిమాం..విఘ్నేశ్వర.
రక్షమాం…రక్షమాం..గౌరీ ప్రియ నందనా రక్షమాం…