సిద్ధంగ ఉన్నాము శ్రీ సిద్ధి వినాయకా…

సిద్ధంగ ఉన్నాము శ్రీ సిద్ధి వినాయకా…
చవితి పండగ చేయ నీకు గణ నాయకా…
మాతా పితరులకు వందనములు చెప్పి కదలి రావయ్య…
వస్తూ వస్తూ..ఆ ఆది దంపతుల దీవెనలు మా కియ్య మోసుకొని రావయ్య…!!సిద్ధం!!

మా మనసు ప్రపంచమును చూడ చాలయ్య నీకు ఆ చిన్ని కనులు…
మా చిన్న కష్టమును వినగ మాకు వరమాయనయా నీకు ఆ పెద్ద చెవులు….
ఆసాంతమూ వింటావు మా వెతలు తీర్చ మౌనముగా…
జరిపించివేస్తావు ఏ కార్యమైన అండగా  ఉండి మా చేత సులభముగా…
!!సిద్ధంగా!!

నీ పండగల అనుబంధాన్ని తలచుకుంటూ పెరుగుతున్న వయసులం…
అనాదిగా వైభవముగ జరుగుతున్న నీ ఉత్సవాలకు వారసులం..
కానరావయ్య గణనాధ..పందిళ్ళ వద్ద కోలాహలం…
వినరావయ్య…”జైబోలో గణేష్ మహారాజ్ కి జై అంటున్న వేల భక్త జన గళం”…!!సిద్ధంగా!!

పాహిమామ్..పాహిమామ్..పార్వతినందన పాహిమాం…
రక్షమాం…రక్షమాం..శివశంకర తనయాయ.. రక్షమాం..

Leave a Comment

Scroll to Top