త్రిదళం…..త్రిగుణాకారం….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

త్రిదళం…..త్రిగుణాకారం….
త్రినేత్రంచ…త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం…
ఏక బిల్వం శివార్పణం..🙏🙏
———————————————-
భక్తితో అర్పించితే చాలు మూడు దళముల పత్రము ఒకటినని…
ఆర్తితో పూజించితే చాలు తీర్చేను మూడు జన్మల పాప సంకటములనని…
శలవిచ్చిన తీరు ఎంత అధ్బుతమయా శంకరా…
మా కల తీరునను మాటకిదే శుభ సంకేతము కదా హర హరా…!!భక్తి!!

పొందింది శంకరా…బిల్వ పత్రము నీ హృదయ స్థానము….
మరుజన్మనైనా కొనసాగనీ తనలాగ మా జీవన ప్రస్థానము…

శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ…
నీ సేవకై నిత్యమూ స్మరించుకుంటూ…
రాలిపోకుండ నేలపై ఒక పత్రమైనా…
వాలిపోయేలాగా నీ పాదాలపైన..
కాపాడుకుంటూ కొమ్మ కొమ్మనీ…
నీపూజలో భాగమవుటకు రెమ్మ రెమ్మనీ…
తరించిపోనివ్వు పుట్టించి మారేడు వృక్షమై…
వ్రేళ్ళూనుకోనివ్వు ఎన్నియుగాలైనా వటవృక్షమై…..

పాహిమాం..పాహిమాం..శివ శంకరా.. పాహిమాం…
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top