నీ చెలిమి కోరు వేళ..
ఈ ఉగ్రము నీకేలా..
ఉరిమి చూడకలా…
ఉజ్జయినీ మహాకాళా..మమ్మిలా..
నువ్వేంతగా చూస్తే మాకంతగా దగ్గరవుతావు…
రవ్వంతగా పూజించితే కొండంతగా చేరువవుతావు…
నీకూ మాకూ లేదు శివా ఎంతో దూరం మన మధ్యన…
నడమంత్రపు సిరులే అడ్డైనాయి నిను చేరనీక నడిమధ్యన…
నా మదిలో నువ్వే కొలువుంటే ఇక అడ్డే ముందిర శంకరా…
నా ఊపిరి లో నువ్ కలిసుంటే సరిహద్దేముంది నీ కరుణకి హర హరా…
పాహీ…పాహీ శంకరా…మాం.పాహీ పాహీ హర హర..