ఓంనమఃశ్శివాయ నమః

ధన్యమైనది శివా…నేడు ధన్యమైనది..
ఈ జన్మమన్నది నేడు ధన్యమైనది…
ఆశగా నోరు తెరిచావు శివా..ఆరగించగా నేడు మా మధుర ఫలములను…
మొక్కేమయా శివా…అట్లే దిగమింగరా దిగంబరా మా ఖర్మఫలములను…
పుణ్యాల శివుడా…పాపాలు తొలగించు..
కారుణ్యాల శివుడా…కనురెప్పలా రక్షించు…
అక్షరాలన్ని అక్షతలు చేసి…
నీ పాదాలపై వేసి పూజలే చేసి…
కళ్లద్దుకోనా నీ భక్తి పద గీతికలు గా వాటిని…
నే దాచుకోనా నా గుండెగుడిలో ఆ దివ్య కావ్య సంపుటిని…
అడగమ్మ పార్వతమ్మ నాపైన దయతలచి మీ పెనిమిటిని…
తాకనిమ్మని చెప్పమ్మ ఈ రీతినైన నను తన హృదయ వాకిటిని….
పాహిమాం..పాహిమాం..మాతా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..రాజ రాజేశ్వరీ దేవీ రక్షమాం..