ఎక్కడని వెతికేను శివశంకరా…

ఓం నమః శివాయ నమః

ఎక్కడని వెతికేను శివశంకరా…
నీ దరిచేరుటెట్లనో గంగాధరా…
సకలమూ సమకూర్చు నిను కానగా…
నేనే తపము చేయవలె నీ మనసెరుగగా..
బదులియ్యారా శంకరా…ఈ ప్రశ్నకి
నీ పాదాలు వీడ నేనేనాటికీ…!!ఎక్కడ!!

జననమన్నది వుంది నీ చేతిలో…
మరణమన్నదీ వుంది నీ చేతిలో…
చావు పుటుకల నడుమ ఈ తనువుని…
బొమ్మనుగ చేసి ఆడుకుందువు నీవెందుకని….
అంతుబట్టని ఈ అన్వేషణల కడలిలో…
తీరమన్నది తెలియక కలిసి పోతున్నాము..మట్టిలో…!!ఎక్కడ!!

ఎడతెగని బంధాలు ఎందుకేస్తావో…
విడి పోనీ బంధముగ ఎటుల చేస్తావో…
చిక్కుకొననిస్తావు భవసాగరమున..
ఏ దిక్కు కానక కొలిచేము ఆ క్షణమున…
పరీక్షించెదవు మమ్ము నెగ్గగలమా లేమనీ….
కర్మ ఫలముల వారసులము తెలుసునయ్యా నీకు ఓడిపోతాము మేమని…!!ఎక్కడ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top