తలచవే మనసా…ఇకనైన శివ శివా అనుచు…

ఓం నమః శివాయ నమః 

తలచవే మనసా…ఇకనైన శివ శివా అనుచు…
మనసార కొలవవే మనసా…కరుణించమని కోరుచూ….
వినగలడు శివుడు వేదనలు ప్రేమ మీరా…
తానవగలడు హరుడు తండ్రిలా వెతలు తీరా…!! తలచ!!

చూపించితే చాలు శివునిపై నీ భక్తిని…
హరుడు కనగలడు నీలోని అంతరాత్మని…
తనకు తానే నీకు వరమివ్వు మనసా….
ప్రతి క్షణము నీకు కలవరమవ్వు మనసా ..
 సిద్ధించదా యోగము ఆ శంకరుని కరుణతో….
ముక్తి లభియించదా దయకనిన ఈశ్వరుడు ప్రేమతో…!! తలచ!!

ఏమాశించనీ వాడు వెండికొండలవాడు…
గంగ జలమునే తప్ప తానేది కోరడు…
ఇస్తివా భక్తితో ఒక మారేడు దళమును…
తీర్చునే మనసా ..మూడు జన్మల పాపములను…
బూడిదేంటయా శంకరా అని ప్రశ్నించు వారికీ…
చిటికెడు విభూతి రూపాన  సంపదలు సమకూర్చుటే తెలుసు పరమేశ్వరునికి…!! తలచ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం….

Leave a Comment

Scroll to Top