ఓమ్ నమ:శ్శివాయ నమ:



ఆశీనులైతే చాలు అరక్షణము భక్తితో నీ ముందర….
గుండెలో చేరి పోతావు వేలుపై..ఎంత దయరా మా పైన గంగాధరా… సుమనసులైతే చాలు…సేవించ నిను శంకరా…..
బహు ఇష్టమైపోతావు..అభయంకరా…!! ఆశీ!!
ఎన్నెన్నో ఆశలతో వస్తాము…నిన్ను చూడాలని…
ఎన్నెన్నో కోర్కెలతో వస్తాము…నిన్ను కోరాలని…..
సర్వాలంకార శోభిత సౌందర్య రూపుడివైన నిన్ను చూశాక…
చూడాలన్న ఆశ తీరిపోతుంది….
కోరాలనుకున్న కోర్కెలడగక, కోర్కెల చిట్టాను మా మనసు చింపివేస్తుంది…..!!ఆశీను!!
చల్లనీ నీ దయ మా మీద వుంటే చాలు…..
ఎల్లలేరుగని ప్రేమతో కరుణిస్తే చాలు…
vaలదయ్య వలదు శంకరా…మాకు ఇంకేమీ వరాలు….
వినిపిస్తే చాలు…సదా మా గుండెలో నీ చిరునవ్వుల స్వరాలు……
బానిసలైపోమా…సదా నీ భక్తికి..
సరిగమ పదనిసలైపోమా…నీ పద కీర్తికి…..!!ఆశీను!!
పాహిమాం…. పాహిమాం…శివశంకరా… పాహిమాం….
రక్షమాం…రక్షమామ్…అభయంకరా.. . రక్షమాం..







