ఉజ్జయినీ శ్రీ కాళలింగమా…
భక్తజన హృదయ ప్రియ జంగమా….
సంపూర్ణ ప్రేమ స్వరూపమా…
మా సంకటములను బాపు దైవమా…!!ఉజ్జయిని!!
విన్నానయా నేను…
విధివంచితులంటే విపరీతమైన ప్రేమ అని….
తెలుసు కున్నానయా నేను…
శిరమొంచి శరణంటే మా వెంటే ఉంటావనీ…
మదనపడిపోతావు…
మా కొరకు మనసున్న మారాజు నేనని…
తపన పడిపోతావు…
ఏ రీతినైన తలరాత మార్చి తరియింప చేయాలనీ…!!ఉజ్జయిని!!
ఈ సువిశాల విశ్వమున వుండాలయా నీ గుడులు ఇంకాస్త ఎక్కువ……
ప్రతిగుండెలో కొలువైతే పెరగదా…
నీపైన ఇంకాస్త మక్కువ…
కల్మషము లేని హృదయాలతో జనులు తిరుగుతుంటే…
జ్ఞాన జ్యోతులై వెలుగులను పంచుతుంటే…..
ఆధ్యాత్మిక పర్యావరణముతో అలరారదా ఈ జగము…..
అద్వైత లోకాల జాబితాలో చేరదా ఈ భువనము…. !!ఉజ్జయిని!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.