సుందరం శంకరుడు బహు సుందరం…

సుందరం శంకరుడు బహు సుందరం…
తక్షణం కొలిచెదము మనమందరం…
తేజోమయం…హరుడు తేజోమయం…
తన మనసు దీనులకు ప్రేమాలయం…
శంభునికి చేద్దాము శిరసాభివందనం…
నీలకంఠునికి ఇద్ధాము నీరాజనం…!!సుందరం!!

కంటిరా కరుణించు ఆ కన్నులు…
మరియు ముక్కంటి చిందించు చిరునగవులు…
వింటిరా ఎపుడైనా తన లీలలు…
వేడుకొనగానే వరమిచ్చి పడు చిక్కులు…
ఎరుగగలమా శివుని అంతరంగమును…
వ్రాయ గలమా హరుని దివ్య చరితమును….!!సుందరం!!

అంటితే శంకరుని పాదాలను…
మన ముక్కంటి తొలగించు మన కర్మను…
మనసుతో చేసితే పూజాదివిధులను….
తన మనసులో చోటిచ్చి ఆదుకొను జనులను…
వరము పొందిన నీ జన్మ మరుజన్మ కోరునా…
శివుని కరుణ పొందిన నీకు తన ఋణము తీర్చంగ నవునా…!!సుందరం!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్షమాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top