కృష్ణా దయకనవా…
శివ కృష్ణా వరమియవా…
జ్ఞానము నివ్వుమయా…
పరమార్ధము తెలుపవయా…
మా పాపపు మూటలు తెంచి మాలో మంచిని పెంచవయా…!!కృష్ణా!!
నీ మాయలు అర్థం కావు…
నీ లీలలు తెలియగ రావు…
ఏ క్షణమున కరుణిస్తావో…
ఏ ఘడియన వరమిస్తావో…
ప్రశ్నగ ఉండును మామదిలో…
దొరకని బదులై ఉండును హృదయములో…!!కృష్ణా!!
నారాయణ నీ అవతారం…
ధర్మోద్ధరణకు ప్రతిరూపం…
గోవిందా నీ సంకల్పం…
దుష్ట శిక్షణకు సాకారం…
సంరక్షించే మనసును కలిగిన…
నల్లని కృష్ణయ్యా నీ మనసే వెన్న….!!కృష్ణా!!
పాహిమాం పాహిమాం కృష్ణ పరమాత్మ పాహిమాం…
రక్షమాం రక్షమాం… దుష్టశిక్షణాయ రక్షమాం…