సాగిల పడరండి శంకరుని చెంతకి…

సాగిల పడరండి శంకరుని చెంతకి…
పుణ్య సంపదలు ఉట్టిపడు ఈశ్వరుని కడకి…
కనులార కనరండి ఈశ్వరుని దివ్య సౌందర్యము…
వేనోళ్ళ పొగడ రారండి తన హృదయ వైశాల్యము…
ఈశ్వరానుగ్రహముతో తొలగు ఇక్కట్లు….
పరమేశ్వరుని కృపతో ప్రారద్రోలచ్చు బ్రతుకు చీకట్లు….!!సా!!

శంకరా…ఎంత పుణ్యము చేసుకొనెనో మా కన్నులు….
ఇంకెంత పుణ్యము చేసుకొనెనో పూజించి ఈ కరములు…
ఈశ్వరా…ఎన్ని వేదనలు వుండెనో మా మనసులో….
వేదనలు వెన్నపూసలై కరిగాయి ఈ క్షణములో….
గౌరీ వరా…గరళమును మింగిన నీకు మా బాధలొకలెక్కా…
శంభో హరా…గంగను మోసే నీకు మా భారమొకలెక్కా….!!సా!!

త్రిశూల హస్తా…నిన్ను పూజింతు త్రిసంధ్యలూ…
గజ చర్మాంబరా…నేను గళమెత్తి పాడేదను నీదు గీతాలు…
నిష్ణాతుడనవ్వనీవా నీ పాదసేవలో….
శివా…నీ పైన తృష్ణ పెరగనీవా నిన్ను దర్శించు వేళలో…
ఆపాద మస్తకం నిను చూడగానే…
ఈ తనువు వాలిపోవాలి చరణాలపై తనకు తానే….!!సాగి!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top