నిరతమూ నిను కొలుతు శివలింగమా…
నేను సతతమూ పూజింతు నిను జంగమా…
సర్వమూ అర్పిస్తు శివశంకరా…
నా మనసుతో అనుసంధానమవ్వయ్య పరమేశ్వరా..
ఉమా మహేశాయా అనుసంధానమవ్వుమా….
ఒక్క సారైన నా మొరకు ప్రాధాన్యమివ్వుమా…!! ని!!
జారి పోయిన క్షణము మరల రాదని తెలుసు…
కరిగి పోయిన కాలము తిరిగి రాదని తెలుసు….
అందుకే ఇమ్మంటి నిను కొలుచు భాగ్యము….
నువ్వేల ముక్కంటి చేతువాలస్యము…
కానలేవా నా కనుల గంగ జలము…
కరుణించి విసిరేయవా నా వైపు విభూది ఫలము…!! ని!!
తక్షణము స్పందించి నీ హృదయము….
మదిలోన కట్టించి ఇవ్వాలి నీ ఆలయం….
మరుక్షణము చేర్పించి నీ రూపము…
నా చేత చేయించు కోవాలి గీతాభిషేకము…
శివా…సాగనీవయ్య నా రచనల క్రతువుని….
హరా..కొనసాగనీవయ్య నీ భక్తి గీతాల వ్రతముని….!! ని!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్షమాం…సర్వేశ్వర రక్షమాం…