సత్యం… శివుడు అతి సుందరం…

సత్యం… శివుడు అతి సుందరం…
నిత్యం హరుని దర్శనం ఒక వరం…
తెలిపెదము ఈశునికి కృతజ్ఞతలు…
శివా…నీకు దాసోహమంటూ…
అర్పించెదము భక్తితో బిల్వపత్రములు…
హరా…శిరసాం నమామి అంటూ…!!సత్యం!!

అందాలకే అతీతుడు అంబికా విభుడు….
అనుబంధాల రూపకుడు ఆది శంకరుడు….
కలవు తనలోన కరుణ జలసిరులు…
కలవు ఎన్నెన్నో ప్రేమగుణ  నిధులు…
కలన తానొచ్చు తపములను చేసినా…
ఇలకు దిగివచ్చు నీ భక్తికి తను మురిసినా….!!సత్యం!!

ప్రాయశ్చిత్తము  చేసుకొన పాదాలపై పడినచో….
పశ్చాతాపము నొంది శంకరా.. శరణననినచో….
ఆశీస్సులు అందించు ఆ పరమశివుడు…..
హత్తుకొని క్షమియించు మన సాంబశివుడు….
ఆ ప్రేమయే శివుని సౌందర్యము…
అదే సృష్టి స్థితి లయకారుని ఆంతర్యము….!!సత్యం!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top