ఓంకార రూపమా జగమేలు జంగమా…

ఓంకార రూపమా జగమేలు జంగమా…
శ్రీకాళ లింగమా భువిజనుల భాగ్యమా….
వెలిశావు మా కొరకు ఈ భరత భూమిన…
పుణ్యఫలములను ఇవ్వంగ  ఉజ్జయిని పురమున…!!ఓం!!

భస్మాభిషేకములు చేయించుకుంటూ….
భక్తులచే శంకరా.. అని పిలిపించుకుంటూ…
ఆనందపడుతువే కాళేశ్వరా…
పరమానంద పడుతువే పరమేశ్వరా….
ఢంకా నాదాల నడుమ హారతిస్తుంటే….
చూడతరమా శివా… నీవు పరవశిస్తుంటే…!!ఓం!!

ఆ అనుభూతికై వచ్చేరు భక్తులెల్ల…
నీ కనుచూపుపడుటకై వేచేరు దీనులెల్ల….
నీ పూజ పువ్వులను పండితులు ఇవ్వగా….
నీ నైవేద్య ప్రసాదములు పురోహితులు పంచగా….
పులకించిపోయేరు భక్తులంతా….
శివా… నీకు అర్పించి పోయేరు తమ మనసునంతా…!!ఓం!!

పాహిమాం..పాహిమాం పరమేశ్వర పాహిమాం..
రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top