గజాననా నీ శుభనామం…
పలికిన చాలును ఒక నిముషం…
ఓ పార్వతి నందన నీ రూపం….
తిలకించిన విజయమే ప్రతి కార్యం…
హే కాణిపాక గణనాయకా…
ఆశీస్సులివ్వు శుభదాయకా….!! గజా!!
తల్లిదండ్రులే దైవమని….
ఆ ప్రేమ మూర్తులే లోకమని….
చేసినావుగా ప్రదక్షిణం…
నువు పొందినావుగా దివ్య వరం….
మెచ్చుకొనెనుగా ప్రమదగణం….
ఆనందమొందెగా హిమాలయం….!!గజా!!
మాతా పితరుల ప్రేమను పొంది…
స్కందుని చెలిమి కి సంతసమొంది…
ప్రమదగణానికి సారధివయ్యీ…
ప్రథమ పూజలకు అర్హుడవయ్యీ… పూజలందుకొను గణనాథా….
మా సేవలందుకొన రారాదా….!! గజా!!
పాహిమాం…పాహిమాం..పార్వతీశా పాహిమాం…రక్షమాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం