శివా…శాంకరీశా…ప్రభో పార్వతీశా…

శివా…శాంకరీశా…ప్రభో పార్వతీశా…
వినుచుంటివా మా బాధలు…
కనుచుంటివా కనుల కన్నీటి సుడులు..
విని ఊరుకుంటే యెట్లయ్య మా బాధలు…
కని తుడవకుంటే యెట్లయ్య వెతల కన్నీళ్లు…!!శివా!!

కర్మఫలములు ముప్పేట దాడిచేస్తుంటే…
నేనెట్లు పొందగలను నీ దయను పొందమంటే…
పాప ఫలముల కోటలో బందీగా నేనుంటే…
నేనెట్లు అందుకోగలను దీవెనలనందుకొనమంటే….
శివా…నను రక్షించు కర్మ ఫలముల బారినుండి..
హరా…నను తప్పించు పాప ఫలముల కోట నుండి…!!శివా!!

చేయించుకో నా చేత గంగ స్నానాలు…
అట్లయిన కరగని కొండంత కర్మలు…
రప్పించుకో నీ గుడికి వేలాది సార్లు…
ముక్కలు ముక్కలై పోనీ నా పాపాల శిలలు….
శివా…గోమాత పొదుగు నీ అభిషేక క్షీర జలధి…
తెచ్చి చేతునయ్యా..అభిషేకములు శక్తి కొలదీ…!!శివా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top