ఓహో గణపతయ్యా…

ఓహో గణపతయ్యా…
నిను సదా కొలుతునయ్యా….
ప్రసాదించవయ్యా….
వరాల విందులయ్య…
శంభో హర గణపతి వందనమని అంటిని…
మా అంబాసుత గణపతి…అభివందనమని అంటిని…!! ఓ!!

దంతమిరిచి వ్రాసినావు మహాభారతం….
ఆ  రచన చేయ చేసినావు మనసు అంకితం…
అలసి పోక వ్రాసినావు అధ్యాయములెన్నో…
సొమ్మ సిల్లి పోక చేసినావు  పద విన్యాసములెన్నో…!! ఓ!!

వ్యాసునిచే మెప్పు పొంది ప్రియ శిష్యుడవైతివి…
పరమేశునిచే వరము నొంది గజముఖునివి అయితివి…
హిమపుత్రికి ముచ్చటై ముద్దు గణపతైతివి….
ఆ షణ్ముఖునికి బంధమై ప్రేమ మూర్తివైతివి…!! ఓ!!

పాహిమాం…పాహిమాం…గణ నాథా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం.. శూర్ప కర్ణ రక్ష మాం…

Leave a Comment

Scroll to Top