వెలకట్టగలనా నేను నీ కరుణని…

వెలకట్టగలనా నేను నీ కరుణని…
శివా…లెక్కించగలనా నీ కృపా కటాక్షములని…
కనిపెట్టగలనా నేను నీ ఉనికిని…
శివా…దర్శించగలనా నీ నిజ రూపుని…
అనంత విశ్వమును పాలించు దేవా…
అతలాకుతలముగా వుంది నా మనసు లాలించ రావా…!! వె!!

నీకు ముదమైన మారేడు దళములతో పూజింతును…
అత్యంత ప్రియమైన రుద్రాక్షలర్పింతును….
ఇష్టమగు గంగతో అభిషేకము చేయిస్తును…
స్వచ్ఛమగు పాలతో పాదాలు స్పర్శింతును…
తెలిసిన సేవలివే నాకు శివశంకరా…
ఏ అలసట నెరుగక చేతు పరమేశ్వరా…!! వె!!

పరిమళత్వము కలది నీ నామ స్మరణము….
అత్యంత ప్రభావితము చూపునది నీ దివ్య దర్శనం….
అమరత్వమును నొసంగు నీ ధ్యాన యోగము…
సత్య శోధన చేయించు నీ నిర్మలత్వము….
నిరాడంబరతకు నీవు పుట్టుకైనావు….
భక్తుల నాదరించుటలో నీవు ఆద్యుడైనావు….!! వె!!

పాహిమాం..పాహిమాం…శివశంకరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top