విశ్వనాథా తిలకించుమా…
సౌరాష్ట్ర సోమనాథా దీవించుమా…
తెచ్చాను భక్తితో ఓ పూల దండ…
మాకు కావాలి శంకరా నీ అండ దండ….
పాడెదను కీర్తనలు శృతి తప్పకుండా….
నిన్ను తలచెదను ప్రతి క్షణము ఏమారకుండా….!! వి!!
సుమమునవకున్ననూ నేను నీ మాలకు..
నన్ను దారముగ ఉండనీ ఈ జన్మకు…
వస్త్రముగ కాకున్న నీ నడుముకు…
వస్త్రమున పట్టు పోగై ఉండనీ ప్రతి జన్మకూ…
ఏ తీరులో నన్ను కరుణింతువో …
శివా…ఏ క్షణములో ఆ వరము నాకిస్తువో…!! వి!!
చూస్తుంటే…కరుణించు నీ కనుల వైపు…
కదలి రావాలనే వుంటుంది నీ గుడి మందిరము వైపు….
ఇస్తుంటే శుభములను నీ కంటి చూపు…
చేసి తీరాలనే వుంది పూజలను మలి సంధ్య లోపు….
రామ పూజలు పొందిన శివలింగమా….
నీ నామ మహిమలు మేము ఎన్న తరమా…!! వి!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…