అడుగో భోళా శంకరుడు…
కరుణించే కాశీ పురహరుడు…
అడుగడుగో దయ గల ఈశ్వరుడు…
అతడొకడే జగమును కాపాడు…
చప్పున కొలువగా రారండి….
మన భక్తిని చాటగ తరలండి….!! అడుగో!!
స్వార్థం, మోసం పక్కన పెట్టి…
ద్వేషం, పగనిక మూటను కట్టి..
పుష్పం,ఫలమును చేతన పట్టి…
ధూపం, దీపం, హారతి పట్టి..
కనులారా తిలకించండి…
శంభుని మనసారా ప్రార్థించండి…!! అడుగో!!
భవ బంధాలకు తాళం వేసి…
ఇహ పర సుఖములు త్యాగం చేసి…
మనసును గుడిగా మార్పులు చేసి…
మన జన్మను శివునికి అర్పణ చేసి…
వేడుకుంటిమా మనమింక…
బోలెడు వరములనిచ్చును భోళా శంకరుడింక…!! అడుగో!!
పాహి పాహి సాంబశివా…మాం పాహి పాహి సదా శివా…రక్షా రక్షా పరమేశా…హర రక్షా రక్షా జగదీశా…