రమ్మంటే రాదురా పుణ్యము…
శివుని కరుణున్నచో జన్మ ధన్యము…
పూజించు శంకరుని చరణాలని..
నీవు స్మరియించు ఈశ్వరుని నామాలని….
పొందేవు తక్షణము తన కరుణను…
నీవు కట్టేవు పుణ్యాల బస్తాలను…!! ర!!
పాలతో చేయరా అభిషేకము…
గంగ జలముతో కడగరా తన పాదము…
బిల్వాలు తెమ్మురా తన పూజకు…
పుట్ట తేనియలు తెమ్మురా తన సేవకు…
మురిసేను శంకరుడు నీ భక్తికి..
మురిసి ఇచ్చేను పుణ్యాలు నీ జన్మకి…!! ర!!
నమక చమకములు పలుకు నటరాజుకి….
యజ్ఞ యాగాదులు చేయు జంగమునికి…
భస్మాభిషేకములు చేయరా గౌరీపతికి….
రుద్రాక్ష మాలలను వేయరా ముక్కంటికి….
మెచ్చేను శంకరుడు నీ భక్తిని…
మెచ్చి చేసుకొను తన గుడిగ నీ ఇంటిని…!! ర!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…